16, నవంబర్ 2012, శుక్రవారం

మీరు తెలుగు భాషాభిమానులా?

మీరు తెలుగు భాషాభిమానులా?

తెలుగు భాష గొప్పదా? లేక ఆంగ్ల భాష గొప్పదా? అన్న అనుమానం మీకు కలుగుతుందా?

పిల్లల్ని ఏ మాధ్యమం లో చదివించాలో అర్ధం కావడం లేదా?

ఐతే ఈ క్రింది వీడియో క్లిప్ చూడండి.

మీకు ఒక అవగాహన వస్తుంది.






9, నవంబర్ 2012, శుక్రవారం

కొంచం నోరు అదుపులో ఉంచుకోండి బాబులూ !

కొంచం నోరు అదుపులో ఉంచుకోండి బాబులూ !

ఈ మధ్య కాలం లో నోటికి ఏది వస్తే అది ఏమాత్రం ఆలోచించకుండా వాగే పెద్దమనుషులు ఎక్కువ అయిపోయారు.


మొన్నటికి మొన్న కరుణానిధి గారు రాముడు ని  తాగుబోతు గా అభివర్ణించారు.



ఈ మధ్య మన గడ్కరి గారు వివేకానంద ని   దావూద్ ఇబ్రహీం ని ఒకే గాట కట్టేశారు.



ఇప్పుడు రామ్ జేత్మలాని గారిని "రిలేషన్షిప్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ "  అనే బుక్ రిలీజ్ చేయటానికి గెస్ట్ కింద ఆహ్వానించారు. వారు రిలేషన్షిప్ గురించో లేక ఉమెన్ గురించో లేక మెన్ గురించో మాట్లాడవచ్చు కదా. వారికి వెంటనే రాముడు గుర్తుకు వచ్చాడు. రాముడు మంచి భర్త కాదు అని నిర్ణయించేశారు.

ఇలా సమయం సందర్భం లేకుండా, విచక్షణ లేకుండా మైకు దొరికింది కదా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఎక్కువ అయిపొయింది.

మరీ దారుణం ఏమిటంటే న్యాయమూర్తులు కూడా పురాణాలను ఉటంకిస్తూ తీర్పులు ఇవ్వడం. (సహజీవనాన్ని సమర్ధిస్తూ రాధాక్రిషులు కూడా చేసింది అదీ అని).

వారి గురించి మాట్లాడే ముందు వారి గురించి పూర్తి తెలుసుకొని, వారి ఎందుకు అలా చేసారో తెలుసుకొని, అర్ధం చేసుకొని మాట్లాడండి దయచేసి.