18, ఏప్రిల్ 2012, బుధవారం

చదువు కొనే చోట ఈ లొల్లి ఏందీ?

జనరల్ గా విశ్వ విద్యాలయం అంటే చదువుకోవడానికి మాత్రమే ఉపయోగ పడుతుందని అనుకుంటాము. కాని ఘనత వహించిన మన OU లో మాత్రం ఆ ఒక్కటి తప్ప మిగిలిన కార్యక్రమాలకి ఉపయోగ పడుతుందని ఈమధ్య కొన్ని సంఘటనలి చూస్తె అర్ధం అవుతుంది. 

రీసెంట్ గా మన ఘనత వహించిన విశ్వ విద్యాలయం లో ఒక మహోద్భుత కార్యక్రమం జరిగింది. దాని పేరు "బీఫ్ ఫెస్టివల్ " 


చదువుకొనే ప్లేస్ లో ఈ రచ్చ ప్రోగ్రామ్స్ ఏంటి?

ఒకడు బీఫ్ ఫెస్టివల్ అని 

ఇంకొకడు డాగ్ ఫెస్టివల్ అని 

మరి ఇంకొకడు ఇంకేదో ఫెస్టివల్ అని జరుపుకోవడానికి అది ఏ హోటల్ తాజో లేక ఇంకోటో కాదు కదా?

ఈలాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు చేయటం  వల్ల  ఎవడికి లాభం ? 

సగటు స్టూడెంట్  ఈ  ప్రోగ్రాం వల్ల ఎంత  ప్రొబ్లెంస్ పేస్ చేస్తారు అని కనీస  ఇంగితం లేకుండా ఈలాంటి వాటిని నిర్వహించే వారిని   సపోర్ట్  చేసే వాళ్ళని ఏమి చెయ్యాలి.

సరే కొంతమంది పని లేని వాళ్ళు ఏదో చేస్తున్నారు అని అనుకోని వదిలేయకుండా వాళ్ళని అప్పోసే చేసేవాళ్ళు ఇంకొందరు.

రెండు ముఠాలు కలసి ఒకడ్ని హాస్పిటల్ పాలు చేసారు మరి కొంత ఆస్తి నష్టం చేసారు.

కాలేజీ లు , విశ్వవిద్యాలయాలు ఉన్నది ఏదో చదువు కోవడానికి సంస్కారం నేర్చుకోవటానికి అంతే కాని ఎవడి   పైత్యాలు వాడు చూపించుకోవడానికి కాదు. 

ఒరేయ్ బాబులు కాస్త బుర్ర వాడండి రా.



13, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఏమి చెయ్యాలి ఇలాంటి మనిషిని?

ఏమి చెయ్యాలి ఇలాంటి మనిషిని?


ఒమర్ ఫరూక్ అనే ఒక మృగం తనకు ఆడపిల్ల పుట్టిందని పిచ్చి ఆవేశంతో అఫ్రీన్ అనే ఆ బిడ్డని గొంతు పిసికి గోడకేసి కొట్టి వెళ్లి పోయాడు. హాస్పిటల్ లో జాయిన్ చేయబడిన ఆ బిడ్డ important  అవయవాలు పని చేయక ట్రీట్మెంట్ కి రేస్పొండ్ అవక పోవడం వల్ల ఆ బిడ్డ ఈ లోకం లో ఉండటానికి ఇష్టపడక తనువు చాలించింది. 
ఏమి చెయ్యాలి ఇలాంటి వెధవల్ని. ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉండటానికి ఏమాత్రం అర్హత లేదు 


సారీ చిట్టితల్లి! ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నందుకు నేను చాలా సిగ్గు పడుతున్నాను.