18, ఏప్రిల్ 2012, బుధవారం

చదువు కొనే చోట ఈ లొల్లి ఏందీ?

జనరల్ గా విశ్వ విద్యాలయం అంటే చదువుకోవడానికి మాత్రమే ఉపయోగ పడుతుందని అనుకుంటాము. కాని ఘనత వహించిన మన OU లో మాత్రం ఆ ఒక్కటి తప్ప మిగిలిన కార్యక్రమాలకి ఉపయోగ పడుతుందని ఈమధ్య కొన్ని సంఘటనలి చూస్తె అర్ధం అవుతుంది. 

రీసెంట్ గా మన ఘనత వహించిన విశ్వ విద్యాలయం లో ఒక మహోద్భుత కార్యక్రమం జరిగింది. దాని పేరు "బీఫ్ ఫెస్టివల్ " 


చదువుకొనే ప్లేస్ లో ఈ రచ్చ ప్రోగ్రామ్స్ ఏంటి?

ఒకడు బీఫ్ ఫెస్టివల్ అని 

ఇంకొకడు డాగ్ ఫెస్టివల్ అని 

మరి ఇంకొకడు ఇంకేదో ఫెస్టివల్ అని జరుపుకోవడానికి అది ఏ హోటల్ తాజో లేక ఇంకోటో కాదు కదా?

ఈలాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు చేయటం  వల్ల  ఎవడికి లాభం ? 

సగటు స్టూడెంట్  ఈ  ప్రోగ్రాం వల్ల ఎంత  ప్రొబ్లెంస్ పేస్ చేస్తారు అని కనీస  ఇంగితం లేకుండా ఈలాంటి వాటిని నిర్వహించే వారిని   సపోర్ట్  చేసే వాళ్ళని ఏమి చెయ్యాలి.

సరే కొంతమంది పని లేని వాళ్ళు ఏదో చేస్తున్నారు అని అనుకోని వదిలేయకుండా వాళ్ళని అప్పోసే చేసేవాళ్ళు ఇంకొందరు.

రెండు ముఠాలు కలసి ఒకడ్ని హాస్పిటల్ పాలు చేసారు మరి కొంత ఆస్తి నష్టం చేసారు.

కాలేజీ లు , విశ్వవిద్యాలయాలు ఉన్నది ఏదో చదువు కోవడానికి సంస్కారం నేర్చుకోవటానికి అంతే కాని ఎవడి   పైత్యాలు వాడు చూపించుకోవడానికి కాదు. 

ఒరేయ్ బాబులు కాస్త బుర్ర వాడండి రా.



2 కామెంట్‌లు:

  1. మరి ధర్నాలు స్ట్రైక్స్ చెయ్యొచ్చా?బస్సులు తగలబెట్టొచ్చా?రౌడీలను హోస్టెల్లలో పెట్టుకొని పోలీసెలని కూడా అడ్డుకో వొచ్చా? వినాయకుడిని పెట్టి పూజలు చెయ్యొచ్చా? హోలీ కి నల్ల మందు తిని గోల చెయ్యొచ్చా?

    ఇది మాత్రం చెయ్యొద్దు.

    రిప్లయితొలగించండి