9, మే 2012, బుధవారం

ఎటు వెళుతున్నాము మనం ?

ఎటు  వెళుతున్నాము మనం ?

నిన్న ఈనాడు పత్రిక  లో ఒక  వార్త చదివాను.

ఒక మగాడు లింగ  మార్పిడి చేయించుకొని ఆడ దానిలా మారాలి అని అనుకొన్నాడు. అది అతని తల్లి దండ్రులకి నచ్చలేదు. దాంతో ఆతను కొర్టు  ను ఆశ్రయించాడు. అతని వాదన  విన్న  కొర్టు వారు ఆతను 21 సంవత్సరాలు నిండిన  వయోజనుడు అని అతనికి తన  ఇష్ట ప్రకారం జీవించే హక్కు ఉంది కాబట్టి తను లింగ  మార్పిడి చేసుకోవచ్చని తీర్పు చెప్పింది. 

నేను కోర్టు ను కాని, అతనిని గాని తప్పు పట్టడం లేదు. కాని నాకనిపిస్తుంది మనం ఎటు వైపు వెలుతున్నాము అని?

మొన్న  విడాకులు తీసుకోవడాని సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది .

అంతకు ముందు స్వలింగ సంపర్కం తప్పు కాదు అన్నారు .

అంతకుముందు సహజీవనం చట్టబద్దమే అని చెప్పారు (కృష్ణుడు రాధ  చేసింది కూడా అదె అని గౌరవనీయులయన  న్యాయమూర్తి గారి అభిప్రాయం).

ఇవన్ని చూస్తుంటే మనం ఎటు వైపు పోతున్నాము అని అనిపిస్తుంది. ?

భారతీయ   విలువల  పట్ల  , భారతీయ  వివాహ  వ్యవస్థ  పట్ల  ఉన్న  గౌరవాన్ని  మన  చేతులతో మనమే   నాశనం చేసుకుంటున్నాము అని అనిపిస్తుంది . 


6 కామెంట్‌లు:

  1. evariki nacchinattu vallu batukutaru.meeku nachinatlu meeru undandi.itarulanu saasinche hakku meeku ledu

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. evariki nacchinatlu vaalu undochhu. neenu evadini saasinchadam ledu. Naa feelings chebutunnanu.aa kkoncham kooda meeku ardham kaaledu antee naaku chalaa baadhga undi

      తొలగించండి
  2. ఇంతక ముందు ఈ పనిని చాలా మంది చేశారు. ఏమయినా అంటే శాపాల వలన మన పురాణ పాత్ర దారులు ఏదో చేయటమే వీరికి ఆదర్శం అంటారు. మీరు చెప్పినట్టు ఈ లింగ మార్పిడికి కూడా మొన్నీ మధ్య ఒకరి వద్దన విన్నాను వారికి ఆదర్శం మన అర్జునుడట. ఏమనాలో అర్థం కాక బురదలో రాయి వెయ్యలేము, బురదని మంచి నీరుగానూ మార్చలేము అని మౌనం వహించాను. ఏదయినా ఇది కలికాలమండీ!

    రిప్లయితొలగించండి
  3. >> కృష్ణుడు రాధ చేసింది కూడా అదె

    ఇవన్ని కథలు అని కొంతమంది అంటారు. నిజమేనా?

    రిప్లయితొలగించండి