25, మే 2012, శుక్రవారం

చేసిన తప్పులకు కులాన్ని/మతాన్ని అడ్డు పెట్టుకోవడం ఎంత వరకు సబబు?

చేసిన తప్పులకు  కులాన్ని/మతాన్ని అడ్డు పెట్టుకోవడం ఎంత  వరకు సబబు?

నిన్న ఒక  స్టేట్ మెంట్  చూసాను  బిసి  సంక్షేమ  సంఘం  అద్యక్షుడు హోదాలో,  అది  ఏమిటంటే  "సిబిఐ  బిసి  మంత్రులనే  తప్పు పట్టి  కుట్ర   పూరితం గా  అరెస్ట్   చేస్తుంది ట  . కాబట్టి  మంత్రి  (సారీ  మాజీ  మంత్రి  అనాలేమో ) మోపిదేవి  అరెస్ట్  ని  ఖండిస్తున్నాడట " 



గౌరవనీయులైన  మంత్రి గారు కూడా  జీవో ల  మీద  అప్పటి  ముఖ్యమంత్రి  బలవంతం  మీద  సంతకం  చేయవలసి  వచ్చిందని  చెప్పారు .

మంత్రి  గారు  చేసిన  ప్రమాణం  మర్చిపోయినట్టునారు . ఒకసారి   గుర్తు చేసుకుంటే  మంచిదేమో .


చేసిన  ప్రమాణాలు మర్చిపోయి వాళ్ళు బలవంతం పెట్టారు.  వీళ్ళు మొహమాట  పెట్టారు అని సంజాయిషి ఇవ్వటం ఒక  భాద్యత  గల  మంత్రి గా  కరెక్ట్  కాదేమో!

చేసిన  దిక్కుమాలిన  పనులకు కులాన్ని లేక  మతాన్ని అడ్డు పెట్టుకోవడానికి నోరు ఎలా వస్తుంది?

ఈయనే కాదు అంతకు ముందు మ్యాచ్  ఫిక్స్   ఆరోపణలు వచ్చినప్పుడు  అజారుద్దీన్  కూడా  ఇలాంటి స్టేట్ మెంట్  ఇచ్చాడు "మైనార్టీ ని కాబట్టే  నన్ను  వేదిస్తున్నారు" అని .



తెహల్కా డాట్ కం వాళ్ళ  స్ట్రింగ్   ఆపరే షన్  లో అడ్డం గా దొరికిపోయిన  బంగారు లక్ష్మణ్  గారి అభిప్రాయం కూడా అదే. దళితుడు అవడం వల్లే  తెహల్కా వాళ్ళు ఈయనను టార్గెట్  చేసారట .

అందలాలు ఎక్కేటప్పుడు, తప్పులు చేసేటప్పుడు ఎవరికీ  వాళ్ళ  కులం గాని / మతం గాని గుర్తురావేమో పాపం.

ఇలాంటి వాళ్ళు ఈస్థాయికి  రావడానికి బహుశా  కులం/లేక  మతం కూడా ఒక  కారణం కావచ్చు. 

అప్పుడు మాత్రం వారి కులం / మతం తో ఏ  ప్రాబ్లం ఉండదు.

ఏమైనా తప్పులు చేసి అవి నిరూపణ  అయినప్పుడో ,  ఆరోపణలు వచ్చినప్పుడో  సడన్  గా అది గుర్తుకు వస్తుంది.

కేవలం అందువల్లే మమ్మల్ని వేధిస్తున్నారు అని కులం/మతం కార్డ్  బయటకు తీస్తారు.

తప్పులు చేయడం లో కూడా రిజర్వేషన్  ఉండాలని వారి అభిప్రాయం కాబోలు.

సిగ్గు పడాలి ఈ  రకం గా డిఫెండ్  చేసుకోవడానికి.

3 కామెంట్‌లు: