8, జూన్ 2012, శుక్రవారం

మహానేత మీద ఎంత ప్రేమా ?

నిన్న సాక్షి టీవీ లో విజయమ్మ గారి స్పీచ్ చూసాను. వై ఎస్  గారి మరణం మీద వారికి  చాలా అనుమానాలు ఉన్నాయని వారు ఆ స్పీచ్ లో చెప్పారు.


వై ఎస్ గారి మృతి మీద జగన్ కి డౌట్ ఉందని వారు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసేటప్పుడు సోనియా గాంధీ కి రాసిన లేఖ లో చెప్పారు.

మరో వైపు కొడుకు మీద కోర్ట్ విచారణకి అనుమతి ఇచ్చినప్పుడు, ఆ కచ్చ తో చంద్రబాబు , రామోజీ రావు , ఇంక చాలా మంది మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి కాబట్టి వారి మీద కూడా కోర్ట్ సిబిఐ విచారణకి ఆదేశిo చాలని  కోర్ట్ లో పిటీషన్ వేసారు  విజయమ్మ గారు. కోర్ట్   ఆ పిటీషన్ కొట్టేసింది  అది వేరే విషయం.

అలాగే కోర్ట్ విచారణ ఆపటానికి సాక్షి గ్రూప్  కి చెందిన చాలా మంది కోర్ట్ మెట్లు ఎక్కారు.

ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే?


వై ఎస్ మరణం మీద అనుమానం ఉంటే విజయమ్మ గారు గాని, జగన్ కాని , వివేకానంద రెడ్డి గాని, రోజా కాని , లక్షిపార్వతి గాని, అంబటి రాంబాబు గాని, జూపూడి ప్రభాకర్ కాని, ఇంకా ఆ పార్టి లో అనుమానం ఉన్న ప్రతి నాయకుడు , కార్యకర్త లో ఒక్కరైనా ఎందుకు కోర్ట్ మెట్లు ఎక్కలేదు ?


విచారణ మళ్ళి చేయాలనో, విచారణ పత్రాలని బహిర్గతం చేయాలనో , బ్లాక్ బాక్స్ సంభాషణల్ని వెల్లడించాలి అనో, అందరికి కాకపొతే కుటుంబ సభ్యులకి అయినా తెలియచేయాలి అనో ఎందుకు పిటీషన్ వేయరు?

కోర్ట్ తీర్పు ఎలా వచ్చినా జస్ట్ ట్రై అయినా చెయ్యాలి గా ?

ఎందుకు చేయలేదు?

ఆస్తులమీద ఉన్న ప్రేమ , మహానేత మీద లేకనా ?

లేక గుండెలు బాదుకొని సెంటిమెంటు ఓట్లు దండుకొనే అవకాసం పోతుంది అనా?

నేను అనుకోవడం అధికారం , ఆస్తిపాస్తుల మీద ఉన్న ప్రేమ.  వై ఎస్ మీద లేదేమో!




3 కామెంట్‌లు:

  1. పప్పు సుద్ధ వైనా తిరుగులేని ప్రశ్న వేశావు.
    ఇందుకు మా సమాధానం:
    1) YSR చావును ప్రతి ఎలక్షన్లోనూ వాడుకోవటం మా హక్కు
    2) ఎన్ని 420 కేసులున్నా, మా మహామేతని ఎలక్షన్లలో పాల్గోవడానికి జైలునుంచి విడుదల చేయాలి, చేస్తూ వుండాలి, లేదంటే అది పెజాసామ్యం కాదని మా ఏజంట్లతో పెతి బ్లాగులోనూ ఏడుస్తాం
    3) మేము సమిక్యాంధ్ర అని చెప్పాము, మా ఎంగిలి బొమికలు తిన్న తెరాస మాకు అడ్డు చెప్పదు

    ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా P.సుద్ధ గారూ?

    రిప్లయితొలగించండి
  2. @అజ్ఞాత:

    మీ ఆంధ్రోల్ల కొట్లాటలో తెలంగాణాను గుంజోద్దు

    రిప్లయితొలగించండి