18, జూన్ 2012, సోమవారం

దేశానికి పతకం తేవడం కన్నా వీరి ఈగో సాటిస్ ఫై అవడం ముఖ్యం


ఒలంపిక్స్ కి టెన్నిస్ డబుల్స్ టీం ని సెలెక్ట్ చేయడానికి అఖిల భారత టెన్నిస్ సంఘం గత కొద్ది రోజులుగా జుట్టు పీక్కుంటుంది.  రాంకింగ్  పరం గా చూస్తే  లియాండర్ పేస్ , మహేష్ భూపతి ని టీం కింద ఎంపిక చేయాలి. ఒక వేళ  ఇద్దరి లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ రాంక్  లో ఉన్న బోపన్న ని సెలెక్ట్ చేయాలి.

పేస్ భూపతి తో  కలసి ఆడటానికి రెడీ గానే ఉన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే భూపతి తన కన్నా ఎక్కువ రాంక్ ఉన్న  పేస్ తో కాకుండా , తన కన్నా తక్కువ రాంక్ తో ఉన్న బోపన్న తో కలసి ఆడతాడట . లేకపోతె తనతో పాటు బోపన్న కూడా టీం నుంచి తప్పుకుంటాడు అట . భూపతి తను  ఆడకపోవటమే కాకుండా బోపన్నని కూడా పోల్యుట్ చేసి  తనని కూడా ఆడకుండా చేస్తున్నాడు. 




ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలా అని టెన్నిస్ సంఘం తర్జనభర్జన పడుతుంది.

నాకు తెలిసి పేస్ కి కొద్దో గొప్పో అంకిత భావం ఉంది ఆట పట్ల, దేశం పట్ల. ఇంతకు ముందు వ్యక్తిగత విభాగంలో మెడల్ తెచ్చిన చరిత్ర  కూడా ఉంది. అవన్నీ వదిలేసి భూపతి బ్లాక్మెయిల్ చేయడం ఏంటో నాకు అర్ధం కావడం లేదు.

దేశానికి పతకం తెచ్చే అవకాసం ఉన్న అతి తక్కువ ఈవెంట్స్ లో టెన్నిస్ డబుల్స్ ఒకటి. అలాంటి  చోట దేశానికి మెడల్ తేవడం ఎలా అని ఆలోచించకుండా ఈ పాలిటిక్స్ ఏంటో అర్ధం కావడం లేదు.



పోనీ తనకి ఇష్టం లేకపోతె తను మానేయోచ్చు కదా. వేరే వారిని కూడా చెడగొట్టడం ఏంటో ?

వీరికి వీరి ఇగో కన్నా దేశం ముఖ్యం కాదు లా ఉంది.

ఎక్కడ చూసినా వెధవ రాజకీయాలే.

సొంత లాభం  కొంత మానుకుందాం అన్న సెన్స్ కొంచం కూడా లేదు.

మంచి ఆటగాళ్ళు ఉన్న చోట బోర్డు చెత్త రాజకీయాలు .

బోర్డు బాగున్న చోట చెత్త ఉద్దేశాలు ఉన్న ఆటగాళ్ళు.

ఇలాంటి వారు ఉండబట్టే 100 కోట్ల పైన జనభా ఉన్నా పతకాలకి ముక్కి ములుగుతున్నాం .


14 కామెంట్‌లు:

  1. మీరు మీ కోణంలో నుండి బాగానే మాట్లాడారు.
    కాని భూపతి కోణం నుండి కూడా చూడండి.
    భూపతి పేస్ కలిసి కొన్నాళ్ళు అద్భుతంగా రాణింఛారు.
    ఆ తరువాత విబెధాలు తలెత్తి విడిపోయారు.
    ఆ విబేధాలకు కారణాల్లో ప్రధానమైనది పేస్ తనతో సుపీరియారిటీ కాంప్లెక్స్ తో వ్యవహరించటం అని భూపతి ఆ రోజుల్లో ఆరోపించాడు. ఆ తరువాత దేశం కోసమని కొద్దిసారులు కలిసి ఆడినా వారిమధ్య సయోధ్య కుదర లేదు. ఈ నాడు వీరిద్దరూ కలిసి ఆడినా పతకం వచ్చే అవకాశాలు తక్కువే.

    మీక్కోపం వచ్చింది కాబట్టి "చెత్త ఉద్దేశాలు ఉన్న ఆటగాళ్ళు" అనేసారు. అంత తేలికగా అనటం సరికాదని నా అభిప్రాయం. మీకు భూపతిమీద కోపం ఉండవచ్చును. కాని సులభంగా తేల్చిపారేయకండి. భూపతి యెంత నిలకడగా అంతర్జాతీయంగా రాణిస్తున్నా, మన టెన్నిస్ సంఘం పేస్ భజన చేస్తున్నదే కాని యేనాడూ భూపతికి తగిన గౌరవం ఇవ్వలేదు. కారణం ఉత్తర దక్షిణాల మధ్య వివక్ష చూపే వారి బుద్ధియే అని లోగడ భూపతి అభిప్రాయం వెలిబుచ్చా డనుకుంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. OK mee vaadanee correct anukundaam. Tanaku pace to aadatam ishtam lekapote tanu manoyyocchu. Bopanna kooda aadadu neenu aadakapote ani verevaadi uddesyam koodaa tanee cheppadam enduku?

      And naaku bhupathi meeda kopam emi leedu eee godava valla ekkada raavalasina oka patakam miss avutundo ani baadha maatramee undi. Ardham chesukuntaaranukuntaanu.

      తొలగించండి
    2. పప్పుసుద్ద గారూ,
      తెలుగువారికి తెలుగులిపి చదవటం చాలా బాగా అనిపిస్తుంది. వేరే లిపిలో తెలుగు చదవటం కొంత కృతకంగా ఉంటుంది.

      బోపన్నకూడా ఆడడని భూపతి ప్రకటించటం అసమంజసమే.

      ఇప్పటికి భూపతి-పేస్ జంట నాలుగు సార్లు ప్రయత్నించి కూడా దేశానికి పతకం తేలేక పోయింది.

      ఇద్దరు అత్యుత్తమ రాంకర్లను జోడిస్తే కన్నా ఒక మంఛి ఫార్మ్ లో ఉన్న జోడీని అడనిస్తే మెరుగైన ప్రదర్శనకు అవకాశం ఉంటుంది. బోపన్నా భూపతుల జోడికి ఇప్పటికే మంచి స్థాయి ఉంది. బోపన్నను పేస్ తో ఆడించటం బోపన్నకే నష్టం తేవచ్చును. ఒకవేళ యీ కొత్తజంట అనుకున్నట్లు రాణించకపోతే విమర్శకులు బోపన్ననే తప్పుపట్టే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళలో పేస్ యెలా ఆడినా భళీ అనే వాళ్ళే యెక్కువ.

      ఒకప్పుడు రోజ్ వాల్, న్యూకాంబ్, విజయ అమృతరాజ్ అనే ముగ్గురూ నాకు గుర్తున్నంత వరకూ దాదాపు ఒకే సమయంలో తెరమీదకు వచ్చారు. కాని ఆటను అభివృధ్ధి పరచుకోక విజయ్ పేలవంగానే ఆడేవాడు. మిగతా యిద్దరూ బాగా రాణించారు అంతర్జాతీయంగా. కాని మన పత్రికలకు వ్యాసాలు వ్రాసే వాళ్ళు విజయ్ అమృతరాజును ఆకాశానికి యెత్తుతూనే ఉండేవారు. అతడు, అంతంతమాత్రం ఆటగాడయిన అతడి అన్న ఆనంద్ అనే వాళ్ళే చాలాకాలం విసుగెత్తించారు మనని.

      తొలగించండి
    3. Sorry telugu ni english lo type chestunanduku. Kaani comments kooadaa telugu lo ela raayaalo teleedam ledu. Kaastha guide cheste santoshistaanu.

      May be meee abhiprayam correct kaavachu. Tennis doubles lo patakam raavadamee naaku kaavali. Adi evaru aadinaa naaku no problem. Kaani vere atani tarupuna bhupathi cheppadam naaku nachhaledu.

      తొలగించండి
    4. మీరు google IME ఉపయోగించండి.
      Linux అయితే ibus నాకు MAC గురుంచి తెలియదు.

      తొలగించండి
    5. GOOGLE IME పని చెయడం లేదండి నేను try చేసాను.

      తొలగించండి
  2. బర్హా 9.1 డౌన్ లోడ్ చేసుకోండి. అందులో బర్హ అని ఉంటుంది. కింద మీరు ఇంగ్లిష్లో టైప్ చేస్తోంటే తెలుగులో మధ్య కనపడుతుంది. దాన్ని కరక్ట్ చేసుకోవచ్చు. తప్పులొస్తే. అప్పుడు అ మీద క్లిక్ చేయండి. దాన్ని కాపీ పేస్ట్. పనైపోయింది. చూడండి.

    రిప్లయితొలగించండి
  3. కృతజ్ఞతలు బాగా చెప్పేరు. అబ్బ ఎంత సంతోషమేసిందో..............:)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షమించండి ఎదో తొందరలో అలా జరిగింది. మరొసారి కృతజ్ఞతలు.

      తొలగించండి
  4. ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమన్నట్టు, పోటీ తక్కువ ఉండే డబుల్స్ ఆడడానికి వీళ్ళకి ఇంత తిక్క ఏమిటో!

    రిప్లయితొలగించండి