15, జూన్ 2012, శుక్రవారం

శాంపిల్ చూపించారు


వైకాపా పార్టీ ఉపఎన్నికల లో సాధించిన విజయాన్ని సెలబ్రేట్  చేసుకుంటూ ఆ పార్టీ నేత  రెహ్మాన్  ఖాన్  గబ్బర్ సింగ్  లెవెల్  లో తన  లైసెన్సు తుపాకితో గాలి లోకి కాల్పులు జరిపారు . పైగా టిడిపి నేత  రేవంత్ రెడ్డి గన్  బయటకు కనిపించేలా తిరగడం తప్పు కాకపొతే ఇది కూడా తప్పు కాదు అని సెలవిచ్చారు. అతి కష్టం మీద  పోలీసులు సదరు నేతని అదుపులోకి తీసుకున్నారు.

ఇంకో సంఘటన లో  చంచల్ గూడ జైలు దగ్గర నిబందనలకు వ్యతిరేకం గా సంబరాలు జరుపుకోటానికి ప్రయత్నించిన కార్యకర్తలు అడ్డు చెప్పిన పోలీసులతో ఆర్గ్యుమెంట్ కి దిగారు. పోలీసులు ఒక 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఉపఎన్నికల సంబరాలే ఇలా ఉంటే  రేపు 2014(లేకపోతె అంతకు ముందే) ఎన్నికలలో నెగ్గితే , అధికారం వారికే వస్తుంది  కాబట్టి అప్పుడు వారి సెలబ్రేషన్స్ఏ  రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవడానికే  భయం గా ఉంది. అప్పుడు గాలిలోకి కాకుండా జనాల  పైకే కాల్పులు జరిపినా అడిగే దిక్కు ఉండదు.

ఆనందం ఎక్కుయై ఒక వంద బస్సులను కూడా తగలేట్టొచ్చు.

జస్ట్ సెలబ్రేషన్స్ ఆ రేంజ్ లో ఉంటే , పాలన ఏ  రేంజ్ లో అయినా ఉండొచ్చు.

సింపుల్ గా రాష్ట్రాన్ని మరో బీహార్ చేసేయ్యొచ్చు.  లేదా ఏ  అఫ్గానిస్తన్  లానో చేసెయ్యొచ్చు.

గో వైకాపా గో.

ఎలాగూ మీకు సపోర్ట్ చేయడానికి గొర్రె జనం ఉండనే  ఉన్నారు.(కొన్ని పదకాలు చూసి , లేక నోటు తీసుకొని , లేక మందు తాగి వోట్ వేయడానికి. దేశం , రాష్ట్రము ఏమైపోతే వారికి ఎందుకు?)

మిగతా పార్టీలలో అంత గొప్ప నీతిమంతుడు కూడా ఎవడు లేడు.

సో మీకిక అడ్డే  లేదు.

ఏ లండి ఈ రాష్ట్రాన్ని , తీసుకుపోండి జనాల్ని రాతి యుగం లోకి.


6 కామెంట్‌లు:

  1. రాతియుగం లోకి తీసుకు వెళ్లడం ఏమిటండి. జిస్ కా లాఠీ ఉస్ కా భైంస్. ఉప్పుడు కొన్నివేల ఎకరాలే ఆక్రమించారు. వైకాపా వస్తే అంతా ఆక్రమిస్తారు అప్పుడు జనం ఏడుస్తారు.

    రిప్లయితొలగించండి
  2. Janam ki Mandhu , Free ga rice iste chalu..

    Ippudu Prajale pedda avineethi parulu...

    రిప్లయితొలగించండి
  3. బుర్ర ఉన్నవాళ్ళు, అలోచనా శక్తి ఉన్నవాళ్ళు, కూడ మంచి, చెడు మర్చిపోయి.. silent గా ఉండిపోవడమో, నోరు మెదపకపోవడమో చేస్తే కుక్కలు కూడ మనల్ని పరిపాలిస్తాయి (sorry. ఈ comment చూస్తె కుక్కల జాతి కూడ నా మీద పగ పట్టవచ్హు.. వాళ్ళని దరిద్రపు రాజకీయనాయకులతోను, చేతకాని.. చవటలయిన మూర్ఖపు వోటర్లతోను పోల్చి కించపరిచినందుకు..)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Decide chesedi naaku telisi below middle class and poor people(endukante vaari janabhaa ekkuva kaabatti). Vaaaru notu, mandu, padhakaala mattulo unnaru.Raajakeeya nayakulu kooada vaarinee aakarshincha daaniki try chestaaru anni uchitam ani cheppi.

      తొలగించండి