23, జూన్ 2012, శనివారం

మీడియా విలువల గురించి మాట్లాడే ఓ యువనేత గారు ముందు మీ సొంత మీడియా కి నేర్పించండి ఆ విలువలు.

నాకు బాగా గుర్తు గాలి జనార్ధన్ ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు మీడియా వాళ్ళు మన ప్రియతమ యువనేత అబిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు  మన సారు గారికి కోపం వచ్చి మీడియా వారికి క్లాస్ పీకారు  మీడియా విలువలు పాటించాలి అని.

అప్పుడే  కాక వీలు ఉన్నప్పుడల్లా మీడియా విలువల గురించి మీడియా కి పాఠాలు చెబుతూనే ఉన్నారు.

ఈ విలువలు పాటించడం అనేది బహుసా వారి సొంత మీడియాకి అక్కరేలేదేమో. ఈ క్రింది క్లిప్పింగ్ చూడండి.



ఈ రకం గా ఒక వ్యక్తి గురించి కామెంట్ చేయడం ఏ రకమైన విలువలకి ఉదాహరణ.

నేను ఇక్కడ చెప్పేది జెడి లక్ష్మి నారాయణ  గురించి  కాదు, చంద్రబాల గురించి. ఒక స్త్రీ ని రిప్రజెంట్ చేసే విధానం అదేనా ?

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వారిని(విటులని కాదు) కూడా గౌరవంగా చూడమని లా చెబుతుంది.

ఒక వ్యక్తి ఫోన్ కాల్స్ లిస్టు లో ఒక మహిళ  నంబర్ ఉన్నంత మాత్రాన ఆ మహిళని అంత చీప్ గా రిప్రజెంట్ చేయాలా?

అలా చేయడం మీడియా విలువలు పాటించడమేనా ?

పక్క వాళ్లకు బుద్ది చెప్పేటప్పుడు మీ సొంత మీడియా కి కూడా చెప్పండి బుద్ధి.

అయినా దర్యాప్తు జరుపుతున్న వ్యక్తి మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అవి దర్యాప్తు చేసే కోర్ట్ కి ఇచ్చి న్యాయపోరాటం చేయాలి కాని, ఇలా చేతిలో ఉన్న మీడియా ద్వారా గోల చేయడం ఏం విలువలు పాటించడం అవుతుంది.?

22, జూన్ 2012, శుక్రవారం

అదరహో ఏమి సృజనాత్మకత !

పెళ్లి చేసుకొని సినిమాల నుంచి విరామం తీసుకున్న శ్రీదేవి మళ్ళి నటించడం మొదలు పెట్టింది.

శ్రీ దేవి హీరొయిన్ గా ఒక చిత్రం త్వరలో మన ముందుకు రాబోతుంది. సినిమా పేరు ఇంగ్లిష్ వింగ్లిష్.

ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ టివి 9 లో చూసాను. చూడగానే నన్ను బాగా ఆకర్షించింది.

సినిమా స్టొరీ ఏమిటంటే ఒక మధ్యతరగతి గృహిణి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిచడం, అందులో భాగం గా తనకి ఎదురైనా అనుభవాలు కామెడీ గా చూపించారు.

జనరల్ గా మన సినిమా ల ట్రైలర్ లు ఎలా ఉంటాయో మీకు తెలుసుగా.

దానికి భిన్నం గా చాలా కొత్తగా , సినిమా సబ్జెక్టు ఏంటో ఈజీ గా అర్ధం అయ్యేలా కూడా వుంది.


మీరూ ఒక లుక్కెయ్యండి.




అన్నట్లు శ్రీదేవి కూడా చాలా అందం గా ఉంది(ఎట్ లీస్ట్  నా కళ్ళకి).

వీడియో కర్టెసీ : Youtube.


20, జూన్ 2012, బుధవారం

కంగ్రాట్స్ లక్ష్మణ్


మన వీ వీ ఎస్ లక్ష్మణ్  కి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఆఫ్ కోర్సు మన దేశం లో కాదు లెండి ఇంగ్లాండ్ లో.

తన పేరు ని ఇంగ్లాండ్ లోని ఒక క్రికెట్ క్లబ్ కి పెట్టారు వీ వీ ఎస్  లక్ష్మణ్ క్రికెట్ క్లబ్ అని.

ఇంగ్లాండ్ లోని బ్రాడ్ ఫోర్డ్ లోని మనీష్ పటేల్ అనే ఒక వ్యాపారవేత్త అక్కడ జరిగే లోకల్ స్కూల్ లీగ్ లో పోటి చేసే తన జట్టుకి లక్ష్మణ్ పేరు పెట్టాడు.

మన దేశం లో , రాష్ట్రం లో సరైన గౌరవం దక్కకున్నా పరాయి దేశం లో దొరికిన ఈ కాస్త గుర్తింపు నాకు చాలా సంతోషం కలిగించింది.

కంగ్రాట్స్ లక్ష్మణ్.




18, జూన్ 2012, సోమవారం

దేశానికి పతకం తేవడం కన్నా వీరి ఈగో సాటిస్ ఫై అవడం ముఖ్యం


ఒలంపిక్స్ కి టెన్నిస్ డబుల్స్ టీం ని సెలెక్ట్ చేయడానికి అఖిల భారత టెన్నిస్ సంఘం గత కొద్ది రోజులుగా జుట్టు పీక్కుంటుంది.  రాంకింగ్  పరం గా చూస్తే  లియాండర్ పేస్ , మహేష్ భూపతి ని టీం కింద ఎంపిక చేయాలి. ఒక వేళ  ఇద్దరి లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ రాంక్  లో ఉన్న బోపన్న ని సెలెక్ట్ చేయాలి.

పేస్ భూపతి తో  కలసి ఆడటానికి రెడీ గానే ఉన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే భూపతి తన కన్నా ఎక్కువ రాంక్ ఉన్న  పేస్ తో కాకుండా , తన కన్నా తక్కువ రాంక్ తో ఉన్న బోపన్న తో కలసి ఆడతాడట . లేకపోతె తనతో పాటు బోపన్న కూడా టీం నుంచి తప్పుకుంటాడు అట . భూపతి తను  ఆడకపోవటమే కాకుండా బోపన్నని కూడా పోల్యుట్ చేసి  తనని కూడా ఆడకుండా చేస్తున్నాడు. 




ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలా అని టెన్నిస్ సంఘం తర్జనభర్జన పడుతుంది.

నాకు తెలిసి పేస్ కి కొద్దో గొప్పో అంకిత భావం ఉంది ఆట పట్ల, దేశం పట్ల. ఇంతకు ముందు వ్యక్తిగత విభాగంలో మెడల్ తెచ్చిన చరిత్ర  కూడా ఉంది. అవన్నీ వదిలేసి భూపతి బ్లాక్మెయిల్ చేయడం ఏంటో నాకు అర్ధం కావడం లేదు.

దేశానికి పతకం తెచ్చే అవకాసం ఉన్న అతి తక్కువ ఈవెంట్స్ లో టెన్నిస్ డబుల్స్ ఒకటి. అలాంటి  చోట దేశానికి మెడల్ తేవడం ఎలా అని ఆలోచించకుండా ఈ పాలిటిక్స్ ఏంటో అర్ధం కావడం లేదు.



పోనీ తనకి ఇష్టం లేకపోతె తను మానేయోచ్చు కదా. వేరే వారిని కూడా చెడగొట్టడం ఏంటో ?

వీరికి వీరి ఇగో కన్నా దేశం ముఖ్యం కాదు లా ఉంది.

ఎక్కడ చూసినా వెధవ రాజకీయాలే.

సొంత లాభం  కొంత మానుకుందాం అన్న సెన్స్ కొంచం కూడా లేదు.

మంచి ఆటగాళ్ళు ఉన్న చోట బోర్డు చెత్త రాజకీయాలు .

బోర్డు బాగున్న చోట చెత్త ఉద్దేశాలు ఉన్న ఆటగాళ్ళు.

ఇలాంటి వారు ఉండబట్టే 100 కోట్ల పైన జనభా ఉన్నా పతకాలకి ముక్కి ములుగుతున్నాం .


15, జూన్ 2012, శుక్రవారం

శాంపిల్ చూపించారు


వైకాపా పార్టీ ఉపఎన్నికల లో సాధించిన విజయాన్ని సెలబ్రేట్  చేసుకుంటూ ఆ పార్టీ నేత  రెహ్మాన్  ఖాన్  గబ్బర్ సింగ్  లెవెల్  లో తన  లైసెన్సు తుపాకితో గాలి లోకి కాల్పులు జరిపారు . పైగా టిడిపి నేత  రేవంత్ రెడ్డి గన్  బయటకు కనిపించేలా తిరగడం తప్పు కాకపొతే ఇది కూడా తప్పు కాదు అని సెలవిచ్చారు. అతి కష్టం మీద  పోలీసులు సదరు నేతని అదుపులోకి తీసుకున్నారు.

ఇంకో సంఘటన లో  చంచల్ గూడ జైలు దగ్గర నిబందనలకు వ్యతిరేకం గా సంబరాలు జరుపుకోటానికి ప్రయత్నించిన కార్యకర్తలు అడ్డు చెప్పిన పోలీసులతో ఆర్గ్యుమెంట్ కి దిగారు. పోలీసులు ఒక 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఉపఎన్నికల సంబరాలే ఇలా ఉంటే  రేపు 2014(లేకపోతె అంతకు ముందే) ఎన్నికలలో నెగ్గితే , అధికారం వారికే వస్తుంది  కాబట్టి అప్పుడు వారి సెలబ్రేషన్స్ఏ  రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవడానికే  భయం గా ఉంది. అప్పుడు గాలిలోకి కాకుండా జనాల  పైకే కాల్పులు జరిపినా అడిగే దిక్కు ఉండదు.

ఆనందం ఎక్కుయై ఒక వంద బస్సులను కూడా తగలేట్టొచ్చు.

జస్ట్ సెలబ్రేషన్స్ ఆ రేంజ్ లో ఉంటే , పాలన ఏ  రేంజ్ లో అయినా ఉండొచ్చు.

సింపుల్ గా రాష్ట్రాన్ని మరో బీహార్ చేసేయ్యొచ్చు.  లేదా ఏ  అఫ్గానిస్తన్  లానో చేసెయ్యొచ్చు.

గో వైకాపా గో.

ఎలాగూ మీకు సపోర్ట్ చేయడానికి గొర్రె జనం ఉండనే  ఉన్నారు.(కొన్ని పదకాలు చూసి , లేక నోటు తీసుకొని , లేక మందు తాగి వోట్ వేయడానికి. దేశం , రాష్ట్రము ఏమైపోతే వారికి ఎందుకు?)

మిగతా పార్టీలలో అంత గొప్ప నీతిమంతుడు కూడా ఎవడు లేడు.

సో మీకిక అడ్డే  లేదు.

ఏ లండి ఈ రాష్ట్రాన్ని , తీసుకుపోండి జనాల్ని రాతి యుగం లోకి.


9, జూన్ 2012, శనివారం

నచ్చావ్ సచిన్!


క్రికెటర్ గా నువ్వు ఎంత గోప్పోడివి అయినా, ఒక్కోసారి నీమీద చాలా కోపం వచ్చేది.

ఇంపోర్ట్ చేసుకున్న కార్ కి టాక్స్ మినహాయింపు పొంది నప్పుడు.

NOC  తీసుకోకుండా కొత్త ఇంట్లోకి వెళ్లి నప్పుడు.

వరల్డ్ కప్ సాధించాలన్న నీ కల తీరాక కూడా వచ్చే వరల్డ్ కప్ లో కూడా నేను ఆడతాను అని స్టేట్ మెంట్ ఇచ్చినప్పుడు.

కొత్త వాళ్లకు అవకాసం ఇవ్వకుండా ఇంకా టీం లో కొనసాగుతున్నందుకు.

వందో సెంచెరీ కోసం మెల్లగా ఆడి బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి ఫైనల్ కి చేరలేకపోయి నప్పుడు, నాకు సెంచేరి  కంటే జట్టు విజయమే ముఖ్యం అని సెలవిచ్చినప్పుడు.

అంతెందుకు నాకు ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం ఎందుకు అని సున్నితం గా తిరస్కరించ  నప్పుడు.

రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నాక అయినా రిటైర్ మెంట్ ప్రకటించానప్పుడు.

ఇలా చాలా సార్లు నీ మీద కోపం వచ్చింది.

కాని ఇప్పుడు... ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పెద్ద బంగాళా ని ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అని తిరస్కరించావు చూడు.

ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావ్.

కీప్ ఇట్ అప్ .

కాకపొతే సచిన్ అన్నయా నువ్వు ఉంటాను అని చెప్పిన హోటల్ బిల్స్ నువ్వే పే  చేసుకుంటే  ఇంకా బాగుంటుంది బిల్లులు ప్రభుత్వానికి పంపకుండా.

8, జూన్ 2012, శుక్రవారం

మహానేత మీద ఎంత ప్రేమా ?

నిన్న సాక్షి టీవీ లో విజయమ్మ గారి స్పీచ్ చూసాను. వై ఎస్  గారి మరణం మీద వారికి  చాలా అనుమానాలు ఉన్నాయని వారు ఆ స్పీచ్ లో చెప్పారు.


వై ఎస్ గారి మృతి మీద జగన్ కి డౌట్ ఉందని వారు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసేటప్పుడు సోనియా గాంధీ కి రాసిన లేఖ లో చెప్పారు.

మరో వైపు కొడుకు మీద కోర్ట్ విచారణకి అనుమతి ఇచ్చినప్పుడు, ఆ కచ్చ తో చంద్రబాబు , రామోజీ రావు , ఇంక చాలా మంది మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి కాబట్టి వారి మీద కూడా కోర్ట్ సిబిఐ విచారణకి ఆదేశిo చాలని  కోర్ట్ లో పిటీషన్ వేసారు  విజయమ్మ గారు. కోర్ట్   ఆ పిటీషన్ కొట్టేసింది  అది వేరే విషయం.

అలాగే కోర్ట్ విచారణ ఆపటానికి సాక్షి గ్రూప్  కి చెందిన చాలా మంది కోర్ట్ మెట్లు ఎక్కారు.

ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే?


వై ఎస్ మరణం మీద అనుమానం ఉంటే విజయమ్మ గారు గాని, జగన్ కాని , వివేకానంద రెడ్డి గాని, రోజా కాని , లక్షిపార్వతి గాని, అంబటి రాంబాబు గాని, జూపూడి ప్రభాకర్ కాని, ఇంకా ఆ పార్టి లో అనుమానం ఉన్న ప్రతి నాయకుడు , కార్యకర్త లో ఒక్కరైనా ఎందుకు కోర్ట్ మెట్లు ఎక్కలేదు ?


విచారణ మళ్ళి చేయాలనో, విచారణ పత్రాలని బహిర్గతం చేయాలనో , బ్లాక్ బాక్స్ సంభాషణల్ని వెల్లడించాలి అనో, అందరికి కాకపొతే కుటుంబ సభ్యులకి అయినా తెలియచేయాలి అనో ఎందుకు పిటీషన్ వేయరు?

కోర్ట్ తీర్పు ఎలా వచ్చినా జస్ట్ ట్రై అయినా చెయ్యాలి గా ?

ఎందుకు చేయలేదు?

ఆస్తులమీద ఉన్న ప్రేమ , మహానేత మీద లేకనా ?

లేక గుండెలు బాదుకొని సెంటిమెంటు ఓట్లు దండుకొనే అవకాసం పోతుంది అనా?

నేను అనుకోవడం అధికారం , ఆస్తిపాస్తుల మీద ఉన్న ప్రేమ.  వై ఎస్ మీద లేదేమో!